బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి నేడు

ABN , First Publish Date - 2021-12-30T16:18:21+05:30 IST

పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను, స్కాలర్‌షి్‌పలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 30న కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ..

బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి నేడు

భువనగిరి రూరల్‌, డిసెంబరు 29: పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను, స్కాలర్‌షి్‌పలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 30న కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు తెలిపారు. భువనగిరిలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలను బహిష్కరించి కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-12-30T16:18:21+05:30 IST