బాష్యానాయక్‌ మృతి బాధాకరం : మంత్రి

ABN , First Publish Date - 2021-05-20T06:36:29+05:30 IST

ఇరిగేషన్‌ శాఖలో ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌గా పని చేసిన ఆంగోతు బాష్యానాయక్‌ కరోనాతో మృతిచెందడం బాధాకరమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.

బాష్యానాయక్‌ మృతి బాధాకరం : మంత్రి

భాష్యానాయక్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

తిరుమలగిరి(సాగర్‌), మే 19: ఇరిగేషన్‌ శాఖలో ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌గా పని చేసిన ఆంగోతు బాష్యానాయక్‌ కరోనాతో మృతిచెందడం బాధాకరమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రంగుండ్ల గ్రామంలో బాష్యానాయక్‌ భార్య జడ్పీటీసీ ఆంగోతు సూర్య, ఇతర కుటుంబస భ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ మారుమూల తండాలో పుట్టి పెరిగి ఉన్నత విద్యను అభ్యసించి నీటి పారుదల శాఖలో ఎగ్జిక్యూటీవ్‌ ఇంజ నీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భాష్యానాయక్‌ అకాల మృతి విచారకరమ న్నారు. గిరిజనుల అభివృద్ధికి తోడ్పాడాలనే సదుద్దేశంతో భార్యను రాజకీయాల్లో ప్రోత్సహి ంచారని గుర్తుచేశారు. ప్రభుత్వం, పార్టీ తరుపున ఆయన కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యే నోముల భగత్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎంసీ.కోటిరెడ్డి, ఎంపీపీ ఆంగోతు భగ వాన్‌నాయక్‌, శాగం రాఘవరెడ్డి, పుట్లూరు రాజశేఖర్‌రెడ్డి, అల్లి పెద్దిరాజు, పిడిగం నాగయ్య, కేవీ.రామారావు, బొల్లెపల్లి రమణరాజు, శాగం శ్రవణ్‌కుమారెడ్డి ఉన్నారు. 


Updated Date - 2021-05-20T06:36:29+05:30 IST