యూనిట్లపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-12-25T05:36:04+05:30 IST

దళితబంధు పథకంలో భాగంగా యూనిట్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

యూనిట్లపై అవగాహన కల్పించాలి
దళితబంధు పథకంపై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

 కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 24 : దళితబంధు పథకంలో భాగంగా యూనిట్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. దళితబంధు పథకంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఐచ్చిక ప్రకారమే యూనిట్లు మంజూరు చేయాలని, వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా మంజూరు చేస్తున్న పలు పథకాల వివరాలను సంబంధిత శాఖకు సత్వరమే అందించాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని సూచించారు. తిరుమలగిరి మండలంలో ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించామన్నారు. అదేవిధంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వంద మంది చొప్పున దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. వారికి మంజూరైన నిధులు నిష్పక్షపాతంగా అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎస్‌.మోహన్‌రావు, పాటిల్‌ హేమంత్‌కేశవ్‌, జడ్పీసీఈవో సురేష్‌, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, కిషోర్‌కుమార్‌, వెంకారెడ్డి, పీడీ కిరణ్‌కుమార్‌, సంక్షేమ అధికారులు శిరీష, దయానందరాణి, శంకర్‌, డీపీవో యాదయ్య, ఏడీఏ రామారావునాయక్‌, శ్రీధర్‌, డీఎ్‌సవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:36:04+05:30 IST