కరోనాపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-08-25T06:10:06+05:30 IST

పాఠశాలలు పున:ప్రారంభిస్తున్నందున పిల్లలకు కరోనాపై అవగాహన కల్పించాలని గురుకులాల రాష్ట్ర సెక్రటరీ రోనాల్డ్‌రాస్‌ అన్నారు.

కరోనాపై అవగాహన కల్పించాలి
బాలెంలలో మహిళా గురుకుల కళాశాలను పరిశీలిస్తున్న రోనాల్డ్‌ రాస్‌

 గురుకులాల రాష్ట్ర సెక్రటరీ రోనాల్డ్‌రాస్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌)/సూర్యాపేట రూరల్‌, ఆగస్టు 24: పాఠశాలలు పున:ప్రారంభిస్తున్నందున పిల్లలకు కరోనాపై అవగాహన కల్పించాలని గురుకులాల రాష్ట్ర సెక్రటరీ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని గురుకుల పాఠశాల, కళాశాలలను కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించి మాట్లాడారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా మరుగుదొడ్ల పరిశుభ్రత, తరగతి గదుల శుభ్రతవంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  పాఠశాలల్లో వివిధ పనులకు అందుబాటులో ఉన్న గ్రామ, మునిసిపల్‌ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఆర్‌సీవో అరుణకుమారి, జడ్పీ ఈవో రజని, ప్రిన్సిపల్స్‌ శైలజ, శకుంతలమణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-25T06:10:06+05:30 IST