అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో

ABN , First Publish Date - 2021-11-23T06:28:30+05:30 IST

అతివేగంతో అదుపు తప్పిన ఆటో చెట్టు ను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో

గుండాల, నవంబరు 22: అతివేగంతో అదుపు తప్పిన ఆటో చెట్టు ను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం గుండాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన ఎం.వెంకటేషం అతని కుటుం బసభ్యులతో కలిసి వరంగల్‌ జిల్లా పస్తాల గ్రామంలో శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. గుండాల నుంచి మోత్కూరు మధ్య అతివేగంతో వెళ్లడంతో  అదుపు తప్పిన ఆటో రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. దీంతో ఆ టోలో ప్రయాణిస్తున్న పద్మకు చెయ్యి విరిగింది. ఆటోడ్రైవర్‌ వెంకటేషంతో పాటు వేణుకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న  మండ ల వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి వెళ్లి ప్రథమ చికిత్స నిర్వహించారు. మెరుగైన చికిత్స నిమిత్తం 108లో జనగామ ఏరియా ఆ స్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతిరెడ్డి తెలిపారు.


Updated Date - 2021-11-23T06:28:30+05:30 IST