మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2021-01-20T06:03:41+05:30 IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై యువకుడు మంగళవారం అత్యాచారయత్నం చేశాడు.

మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం

సూర్యాపేట క్రైం, జనవరి 19: సూర్యాపేట జిల్లా కేంద్రంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై యువకుడు మంగళవారం అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు దివ్యాంగురాలైన కుమార్తె(12), కుమారుడు ఉన్నారు. ఇటీవల పాలకవీడు మండలానికి చెందిన యువకుడు నవీన్‌ అదే వీధిలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశాడు. ఈ క్రమంలో బాలికతో నవీన్‌కు పరిచయం ఏర్పడింది. మంగళవారం అటుగా వచ్చిన బాలికను ఎవరూ లేని సమయం చూసి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లోకి పిలిచిన నవీన్‌ లైంగికదాడికి యత్నించాడు. ఇంతలో బాలిక కోసం వెతుకుతున్న తల్లి గుర్తించి నవీన్‌కు దేహశుద్ధి చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా యువకుడికి దేహశుద్ధి చేయటంతో అక్కడినుంచి పరారయ్యాడు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-01-20T06:03:41+05:30 IST