సోదరుడిపై హత్యాయత్నం: ఇద్దరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-12-28T06:20:34+05:30 IST

గజం స్థలం వివాదం సోదరుడిపై హత్యయత్నానికి దారి తీసింది.

సోదరుడిపై హత్యాయత్నం:  ఇద్దరి అరెస్ట్‌

 చౌటుప్పల్‌ రూరల్‌, డిసెంబరు 27: గజం స్థలం వివాదం సోదరుడిపై హత్యయత్నానికి దారి తీసింది. చౌటుప్పల్‌లోని రత్నానగర్‌ కాలనీకి చెందిన తూర్పాటి నవీనకు, ఆయన పెదనాన్న కుమారుడు తూర్పాటి మహే్‌షకు పక్కపక్కనే ఖాళీ స్థలాలు(పాట్లు) ఉన్నాయి.  రూ.5వేల విలువైన గజం స్థలం విషయమై ఇద్దరి మధ్య కొంత కాలంగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీ రాత్రి కాలనీలోని దేవాలయం సమీపంలో ఉన్న నవీనపై మహేష్‌. తన బంధువు వలిగొండకు చెందిన కళ్ళెం శ్రీను కలిసి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. ఈ కేసులో నిందితులు ఇద్దరినీ అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవీన పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-12-28T06:20:34+05:30 IST