మహిళలపై దాడులు అరికట్టాలి
ABN , First Publish Date - 2021-11-26T05:57:16+05:30 IST
: దేశంలో రోజురోజుకు మహిళలపై జరు గుతున్న లైంగిక దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నా యని జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన అన్నారు. అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా

మహిళా సమాఖ్య రాష్ట్ర అద్యక్షురాలు ఉస్తెల సృజన
చిలుకూరు, నవంబరు 25: దేశంలో రోజురోజుకు మహిళలపై జరు గుతున్న లైంగిక దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నా యని జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన అన్నారు. అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని బాపూజీ గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను రక్షిం చేందుకు ఏర్పాటు చేసిన చట్టాలను అమలు చేయడంలో విఫలమయ్యా యన్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, మహిళలు స్వేచ్ఛగా జీవించేలా చట్టాలను నిర్మించాలన్నారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చే శారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లీశ్వరి, నాయకులు అలివేలు, కవిత, బేగం, లక్ష్మి, రోజా, రాములమ్మ, పద్మ, లక్ష్మీకాంతమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల: మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న హింసను అరికట్టాలని కోరుతూ సీపీఐ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నేరేడుచర్లలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ సినిమాలు, సీరియల్స్ వల్ల హింసతో పాటు నేర ప్రవృత్తి పెరిగిపోతుందన్నారు. అశ్లీల వెబ్‌సైట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలు జరిగినప్పుడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా సత్వరమే శిక్షలు విధించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గంటి నరసమ్మ, పద్మ, నాగమ్మ, లక్ష్మి, లక్ష్మమ్మ, వెంకటమ్మ తదితరుల పాల్గొన్నారు.
సూర్యాపేట కల్చరల్: మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని గృహ కార్మికుల జిల్లా కోఆర్డినేటర్ కాస అనసూర్య అన్నారు. అంతర్జాతీయ మహిళ హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని స్నేహనగర్‌లో వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీలో మాట్లాడారు. దేశంలో ఏదో ఒక చోట మహిళలపై దాడులకు గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దైద వెంకన్న, స్వాతి, అంజమ్మ, రేణుక, మహేశ్వరి, భవాని, పూలమ్మ, పిచ్చమ్మ, సత్తెమ్మ, పద్మ, ధనమ్మ, వెంకటమ్మ, యల్లమ్మ, సోమమ్మ, మమత, లక్ష్మి, అనిత, నిర్మల పాల్గొన్నారు.