జర్నలిస్టులపై దాడులు శోచనీయం
ABN , First Publish Date - 2021-02-01T05:44:07+05:30 IST
జర్నలిస్టులపై దాడులు శోచనీయమని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు అన్నారు.

హుజూర్‌నగర్/ గరిడేపల్లి, జనవరి 31: జర్నలిస్టులపై దాడులు శోచనీయమని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు అన్నారు. జర్నలిస్టులపై దాడులకు నిరసనగా హుజూర్‌నగర్ పట్టణంలో ఐజేయూ ఆధ్వర్యంలో శాంతిస్థూపం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐ రాఘవరావుకు వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో నర్సయ్య, టీవీఎల్, దయాకర్ రెడ్డి, శేషం రాజు, పిల్లలమర్రి శ్రీను, రాంరెడ్డి, వెంకటరెడ్డి, బాబు, భిక్షం, గోపినాథ్, రామకృష్ణ, అఖిలపక్షాలు తన్నీరు మల్లిఖార్జున్‌రావు, అరుణ్ కుమార్, నాగారపుపాండు, మురళి, రోషపతి, జెవిఎల్, చంద్రారెడ్డి పాల్గొన్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన వారిని శిక్షించాలని గరిడేపల్లి సీపీఎం మండల కార్యదర్శి షేక్ యాకూబ్ డిమాండ్ చేశారు. గరిడేపల్లి మండలకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనమూర్తి, దస్తగిరి, సైదులు, రవి, రాములు, వెంకన్న పాల్గొన్నారు.