ఆడపిల్లల హక్కుల సంరక్షణకు సహకరించాలి
ABN , First Publish Date - 2021-10-20T07:01:02+05:30 IST
బాల్యవివాహాలను ఎదిరించి ఆడపిల్లలు చదువును కొనసాగిస్తున్నారని, వారి స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందని జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ శాంతాసి న్హా అన్నారు.

జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ శాంతాసిన్హా
ఆత్మకూర్(ఎస్), అక్టోబరు 19 : బాల్యవివాహాలను ఎదిరించి ఆడపిల్లలు చదువును కొనసాగిస్తున్నారని, వారి స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందని జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ శాంతాసి న్హా అన్నారు. మండలంలోని తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన కిశోర బాలికల కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. లింగ సమానత్వం, స్వేచ్ఛ కోసం కిశోర బాలికలు కమిటీ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందుతున్నారన్నారు. బాలికల సమస్యలపై గ్రామ పంచాయతీల సర్పంచ్లు స్పందించి వారి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి చదువుకు ఆటంకం కలగకుండా చూడటం మంచి పరిణామం అన్నారు. ఆడ పిల్లల ఉన్నత విద్య కోసం వారి ప్రయత్నం గొప్పదన్నారు. ప్రభుత్వం వీరికి అండగా ఉండేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎంవీఎఫ్ కార్యక్రమాలతో చాలా మార్పు వస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ జాతీయ కో-ఆర్డినేటర్ ఆర్.వెంకటరెడ్డి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ భాస్కర్ గౌడ్, సర్పంచ్ ఎల్లాచారి, వెంకన్న, సోమయ్య, లలిత, సైదులు, అలివేలు, జయలలిత, తదితరులు పాల్గొన్నారు.