అరెస్టులు అప్రజాస్వామికం
ABN , First Publish Date - 2021-10-20T06:46:46+05:30 IST
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికమని వామపక్ష నేతలు ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామం బీఎన్.తిమ్మాపురం నిర్వాసితులు, వామపక్షాల నేతలను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్ తరలించారు.

పోలీ్‌సస్టేషన్ ఎదుట బీఎన్.తిమ్మాపురం నిర్వాసితుల నిరసన
భువనగిరి రూరల్, అక్టోబరు 19: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికమని వామపక్ష నేతలు ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామం బీఎన్.తిమ్మాపురం నిర్వాసితులు, వామపక్షాల నేతలను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్ తరలించారు. దీంతో అరెస్టులను నిరసిస్తూ ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు, సర్పంచ్ పిన్నం లత రాజు, ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్‌రెడ్డి, ముంపు నిర్వాసితుల ప్రతినిధి వల్దాసు రాజు తదితరులు పోలీసుస్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గోద శ్రీరాములు, ఎండి.జహంగీర్ అక్కడికి చేరుకొని సంఘీభావం తెలిపి మాట్లాడారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా రెవెన్యూ, ప్రాజెక్టు, ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం న్యాయం చేయాలని నిర్వాసితులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు సిద్ధపడుతుండగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని,ఇది అప్రజాస్వామికమన్నారు. వెంటనే నిర్వాసితులను విడుదల చేయాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు ఏశాల అశోక్, ముదిగొండ రాములు, దయ్యాల నర్సింహ, ఉడుత విష్ణు, చంద్రయ్య, బాలనర్సయ్య, వెంకటేశ్, వనం రాజు పాల్గొన్నారు.