హత్య కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-12-26T06:08:09+05:30 IST

మండలంలోని బొక్కముంతలపహాడ్‌ గ్రామం లో ఈ నెల 21వ తేదీన కమతం అచ్చమ్మ(60) హత్య కేసులో నిందితులైన జల్లపల్లి సూర్యనారాయణ, యశోద, శివలను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించా రు.

హత్య కేసులో నిందితుల అరెస్టు

14 రోజుల రిమాండ్‌ - నల్లగొండ జైలుకు తరలింపు 

నిడమనూరు, డిసెంబరు 25: మండలంలోని బొక్కముంతలపహాడ్‌ గ్రామం లో ఈ నెల 21వ తేదీన కమతం అచ్చమ్మ(60) హత్య కేసులో నిందితులైన జల్లపల్లి సూర్యనారాయణ, యశోద, శివలను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించా రు. తమ కూతురును వేధిస్తున్నారనే కారణంతో గ్రామానికి చెందిన జల్లపల్లి సూర్య నారాయణయశోద దంపతులు వారి కుమారుడు శివతో కలిసి తన అల్లుడైన కమతం శివనారాయణ కుటుంబసభ్యులపై కత్తులతో దాడి చేశారు. దీంతో అల్లుడి తల్లి అచ్చ మ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో అల్లుడితో పాటు వియ్యంకుడు భిక్ష మయ్య, వియ్యపురాలు తల్లి నారమ్మ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వి షయం విదితమే. నిందితులు శనివారం ఉదయం 10గంటల సమయంలో గ్రామానికి వెళ్తుండగా వేంపాడు స్టేజీ వద్ద అరెస్టు చేసినట్లు ఇనచార్జి సీఐ గౌరీనాయుడు, ఎస్‌ఐ సైదులు తెలిపారు. నిడమనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట హాజరుపరచగా కే సు విచారించిన న్యాయమూర్తి పురుషోత్తమరావు నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో నల్లగొండ జైలుకు తరలించారు. 

Updated Date - 2021-12-26T06:08:09+05:30 IST