బతుకమ్మ చీరల పంపిణీకి అధికారుల ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-08-20T07:05:09+05:30 IST

ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇవ్వనున్న బతుకమ్మ చీరల పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని టీఎ్‌ససీవో కార్యాలయం నుంచి ఈ చీరలు జిల్లాకు మరో రెండురోజుల్లో చేరనున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో చీరల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

బతుకమ్మ చీరల పంపిణీకి అధికారుల ఏర్పాట్లు

మరో రెండురోజుల్లో జిల్లాకు చేరనున్న చీరలు


నల్లగొండటౌన్‌, ఆగస్టు 19: ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇవ్వనున్న బతుకమ్మ చీరల పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని టీఎ్‌ససీవో కార్యాలయం నుంచి ఈ చీరలు జిల్లాకు మరో రెండురోజుల్లో చేరనున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో చీరల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 18 ఏళ్లు నిం డిన మహిళలందరికీ ఈ చీరలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 4,68,179 ఆహార భద్ర తా కార్డులుండగా, వీటిలో 5,52,509 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. వీరిలో 18 ఏళ్లు నిండిన మహిళల వివరాలను వార్డుల వారీగా చౌకధరల దుకాణాల నుంచి సేకరించి అర్హుల జాబితాను తహసీల్దార్లు సేకరిస్తున్నారు. బతుకమ్మ చీరలను భద్రపరిచేందుకు ప్రతీఅసెంబ్లీ నియోజకవర్గంలో ఒకగోదాంను అధికారులు గుర్తించారు. నల్లగొండ నియోజకవర్గంలో తిప్పర్తి వ్యవసాయమార్కెట్‌యార్డు, మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ,దామరచర్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులు, దేవరకొండలో కొండమల్లేపల్లి వ్యవసాయ మార్కెట్‌, నాగార్జునసాగర్‌లో నిడమనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు, నకిరేక ల్‌ నియోజకవర్గంలో రైతువేదిక కార్యాలయంలో బతుకమ్మ చీరలను భద్రపరచనున్నారు.


చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయండి

బతుకమ్మ చీరలను భద్రపరచడం, పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. జిల్లాలోని ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, గోదాం ఇన్‌చార్జీలతో గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మా ట్లాడారు. జిల్లాలో గుర్తించిన గోదాంల నుంచి గ్రామాలకు చీరలను చేరవేయడంతోపా టు, లబ్ధిదారులకు పంపిణీపై దిశానిర్దేశం చేశారు.ఎంపీడీవోలు వారి నియోజవర్గాల్లోని బఫర్‌ గో దాంల నుంచి చీరలను తీసుకోవాలని, వాటిని ప్రభుత్వ భవనాల్లో భద్రపరిచేందుకు స్టోరే జీ పాయింట్లను గుర్తించాలన్నారు. చీరలను చౌకధరల దుకాణాల్లో భద్రపరచకూడదన్నా రు. గోదాంలకు ఇన్‌చార్జీలను నియమించాలని, చీరల పంపిణీకి సంబంధించిన రికార్డుల ను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి డీఆర్వో జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్‌రావు, చేనే త, జౌళిశాఖ ఇన్‌చార్జి ఏడీ రంజిత్‌, మార్కెటింగ్‌శాఖ అదికారి శ్రీకాంత్‌, ఏఎ్‌సవో పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T07:05:09+05:30 IST