ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎ్‌సదే

ABN , First Publish Date - 2021-03-21T07:18:30+05:30 IST

రాష్ట్రంలో ఎన్నిక ఏది జరిగినా టీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు అని చెన్నూ రు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ సోషల్‌ మీడియా వారియర్స్‌ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు.

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎ్‌సదే
సమావేశంలో మాట్లాడుతున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌

ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

నాగార్జునసాగర్‌, మార్చి 20: రాష్ట్రంలో ఎన్నిక ఏది జరిగినా టీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు అని చెన్నూ రు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ సోషల్‌ మీడియా వారియర్స్‌ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ త్వరలో జరగబోయే సాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 30వేల పైచిలుకు మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని,  వాటి ని తిప్పికొట్టాలన్నారు. పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిలు సీఎంలుగా ఉన్న కాలంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిందని గుర్తు చేశారు. 35 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి గెలిచిన జానారెడ్డి నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. తొలుత ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సోషల్‌ మీడియా వారియర్స్‌ సభ్యులు  క్రిశాంక్‌, దినేష్‌ చౌదరి, జగన్మోహన్‌రావు, సతీ్‌షరెడ్డి వివరించారు.  కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌, టీఆర్‌ఎస్‌ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి తక్కెలపల్లి రవీందర్‌రావు, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ రామకృష్ణారావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎ్‌సలో చేరిక

నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో నిర్వహించిన సోషల్‌ మీడియా వారియర్స్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుమన్‌ సమక్షంలో అనుముల మండలానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు.

Updated Date - 2021-03-21T07:18:30+05:30 IST