అన్యాయం జరిగితే మరోమారు ఉద్యమం

ABN , First Publish Date - 2021-06-21T05:51:18+05:30 IST

గుర్రంబోడుతండా గిరిజన రైతులకు ప్రభుత్వ పరంగా అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి అన్నారు.

అన్యాయం జరిగితే మరోమారు ఉద్యమం
మఠంపల్లిలో రఘుకు స్వాగతం పలుకుతున్న బీజేపీ నాయకులు, రైతులు

మఠంపల్లి / హుజూర్‌నగర్‌, జూన్‌ 20 : గుర్రంబోడుతండా గిరిజన రైతులకు ప్రభుత్వ పరంగా అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి అన్నారు. మఠంపల్లి పోలీ్‌సస్టేషన్‌లో సంతకం చేసేందుకు ఆదివారం వచ్చిన జర్నలిస్టు రఘుకు బీజేపీ నాయకులు, రైతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి మాట్లాడుతూ రైతులు ఉద్యమం చేసినప్పటికీ పాలకులు, అధికారులు కుమ్మకై అర్హులైన రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. సుమారు 2 వేల ఎకరాలు కబ్జాకు గురైతే  కేవలం 120 ఎకరాలే గిరిజనులవి అని తేల్చినట్లు సర్వే అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నకీలి పట్టాలు సృష్టించిన వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. అధికారులు రైతులకు న్యాయం చేయకపోతే మరోమారు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. జర్నలిస్టు రఘు మాట్లాడుతూ పేద గిరిజనులకు న్యాయం జరిగే వరకూ తనవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రఘును రైతులు, బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు బాలాజీనాయక్‌, హనుమానాయక్‌, ఓర్సు వేలంగిరాజు, ఎల్లయ్య, మురళి, అమరయ్య, సైదానాయక్‌, భిక్షంనాయక్‌, శేషిరెడ్డి, రమే్‌షనాయక్‌, నాగరాజు, మురళి, రంగానాయక్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా జర్నలిస్టు రఘు మఠంపల్లి వెళ్లేందుకు హుజూర్‌నగర్‌ రాగా బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. శాలువా కప్పి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేనుమకొండ రామరాజు, బాల వెంకటేశ్వర్లు, ఇంటి రవి, కుంటు నాగరాజు, గంధం సతీష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-21T05:51:18+05:30 IST