నేటి నుంచి మరో విడత వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-02-06T06:19:56+05:30 IST
ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం నేటినుంచి నాలుగురోజులపాటు పోలీస్, మునిసిపల్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీస్, మునిసిపల్ సిబ్బందికి టీకాలు
నల్లగొండ క్రైం/భువనగిరి టౌన్, ఫిబ్రవరి 5: ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం నేటినుంచి నాలుగురోజులపాటు పోలీస్, మునిసిపల్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 19 కేంద్రాల్లో కరోనా ఫ్రంట్ వారియర్స్ 4,885 మంది పోలీ స్, రెవెన్యూ, పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వీరిలో 871 మంది పోలీస్ సిబ్బం ది, 902మంది రెవెన్యూ, 2,53 7మంది పంచాయతీరాజ్, 57 4మంది మునిసిపల్ పారిశుధ్య సిబ్బంది ఉన్నారు. 6వ తేదీన 1,916 మందికి, 8వ తేదీన 1,751 మందికి, 9వ తేదీన 83 మందికి 10వ తేదీ న 235 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.