లక్ష రుద్రాక్షలతో అభిషేకం

ABN , First Publish Date - 2021-11-23T05:44:42+05:30 IST

కార్తీకమాసం సోమవారాన్ని పురస్కరించుకుని మండలంలోని బూరుగడ్డ నల్లకట్ట సంతానకామేశ్వరీ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో శివలింగాన్ని లక్ష రుద్రాక్షలతో అభిషేకం నిర్వహించారు.

లక్ష రుద్రాక్షలతో అభిషేకం
హుజూర్‌నగర్‌లో కోటిదీపోత్సవంలో పాల్గొన్న మహిళలు

హుజూర్‌నగర్‌, నవంబరు 22: కార్తీకమాసం సోమవారాన్ని పురస్కరించుకుని మండలంలోని బూరుగడ్డ నల్లకట్ట సంతానకామేశ్వరీ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో శివలింగాన్ని లక్ష రుద్రాక్షలతో అభిషేకం నిర్వహించారు. మూడేళ్లుగా కార్తీకమాసంలో లక్షరుద్రాక్షలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. అర్చకులు గుంటిపల్లి రవీంద్రాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభిషేకం, పూజలు నిర్వహించగా; ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ చిమ్మట చిన్నసైదులు, గూడెపు శ్రీనివాసు, అరుణ్‌కుమార్‌, యరగాని నాగన్న, భక్తులు పాల్గొన్నారు.Updated Date - 2021-11-23T05:44:42+05:30 IST