ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2021-02-08T05:46:54+05:30 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీలను కించపరి చేలా వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహా సమితి జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల నరేష్‌, ఉప్ప ల సైదులు డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

అడ్డగూడూరు/భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 7: ఎస్సీ, ఎస్టీ, బీసీలను కించపరి చేలా వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహా సమితి జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల నరేష్‌, ఉప్ప ల సైదులు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తి రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగడానికి అనర్హుడన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు సుమిత్రబట్టి, గొల్లబోయన వెంకన్నబాబు పాల్గొన్నారు. రిజర్వేషన్లను కించపరు సూ నిమ్న వర్గాలను అవమానించిన ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చే యాలని ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి భానోతు భాస్కర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. భువనగిరిలో అంబేద్కర్‌ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు. 


Updated Date - 2021-02-08T05:46:54+05:30 IST