కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటోను ముద్రించాలి

ABN , First Publish Date - 2021-12-26T06:13:46+05:30 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను ముద్రించాలని కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్‌ఎస్‌) జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురాం డిమాండ్‌ చేశారు.

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటోను ముద్రించాలి

నల్లగొండటౌన, కొండమల్లేపల్లి, డిసెంబరు 25:  బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను ముద్రించాలని కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్‌ఎస్‌) జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురాం  డిమాండ్‌ చేశారు. ఫొటోను ముద్రించాలని డిమాండ్‌ చేస్తూ పరశురాం చేపట్టిన జ్ఞా నయుద్ధ యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్రకు వివిధ సంఘా ల నాయకులు హాజరై స్వాగతం పలికారు. మొదట డీఈఓ కార్యాలయం ఎదుట గల అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన స భలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ లేకుంటే భారత రాజ్యాంగమే లేదని అన్నారు. కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించేందుకు పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టాల ని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ అధ్యక్ష తన జరిగిన కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, పట్టణ నాయకుడు పెరిక కృష్ణ, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు రేకల సైదులు, బీఎస్పీ నాయకులు గోవర్థన, యాదగిరి, మురళి, జ్ఞానయుద్ధ యాత్ర బృందం తేరియాల సందీప్‌, కొమ్ముగళ్ల మత్స్యగిరి, ప్రశాంత, మధు పాల్గొన్నారు. కొండమల్లేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు గ్యార యాదగిరి, నాగార్జున, గోవర్ధన, అజయ్‌, సైదులు, రాజరావు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-26T06:13:46+05:30 IST