దేవరకొండ ఖిల్లాలో అద్భుత కట్టడాలు

ABN , First Publish Date - 2021-12-14T04:58:07+05:30 IST

దేవరకొండ ఖిల్లాలోని కట్టడాలు అద్భుతమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

దేవరకొండ ఖిల్లాలో అద్భుత కట్టడాలు
రవీంద్రభారతిలో దేవరకొండ ఖిల్లా ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న మంత్రి కిషన్‌రెడ్డి

 రవీంద్రభారతిలో ఖిల్లా ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన మంత్రి కిషన్‌రెడ్డి 

దేవరకొండ, డిసెంబరు 13: దేవరకొండ ఖిల్లాలోని కట్టడాలు అద్భుతమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన దేవరకొండ ఖిల్లా ఫొటో ఎగ్జిబిషన్‌ను కిషన్‌రెడ్డి సోమవారం తిలకించి, మాట్లాడారు. దేవరకొండ ఖిల్లాకు సుదీర్ఘచరిత్ర  ఉందన్నారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించినవారిలో రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వనం పుష్పలత, దేవరకొండ వాసులు ఉన్నారు. 


Updated Date - 2021-12-14T04:58:07+05:30 IST