ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి

ABN , First Publish Date - 2021-12-08T06:43:37+05:30 IST

వచ్చే యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
కొండమడుగులో రైతు అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ పమేలాసత్పథి 

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన 

బీబీనగర్‌, బొమ్మలరామారం, భువనగిరి రూరల్‌, డిసెంబరు 7: వచ్చే యాసంగిలో వరికి బదులు  ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. బీబీనగర్‌ మండలం కొండమడుగు, బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆమె మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వేరుశనగ, జొన్న, మినుములు, నువ్వులు పెసర, శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమలు, ఆవాలు తదితర పంటలు సాగు చేయాలన్నారు. అనవసరంగా వరి పంట వేసుకొని నష్టపొవద్దన్నారు. హైదరాబాద్‌ మహానగరానికి దగ్గరలో ఉన్నందున కూరగాయలు, పువ్వులు, సహజ సిద్ధమైన పంటలపై రైతులు దృష్టి సారించాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకొని తద్వారా పంటల సాగుపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం బీబీనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భువనగిరి అర్బన్‌ ప్రాథమిక కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కొండమడుగు కోట బురుజును కలెక్టర్‌ పమేలా సత్పథి తిలకించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌ఎంపీపీ గణే్‌షరెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, మండల వ్యవసాయ అధికారి పద్మ, ఎంపీవో స్వాతి, సర్పంచ్‌ కడెం లతా రమే్‌షబాబు, ఉపసర్పంచ్‌ కృష్ణవేణి, రైతులు పాల్గొన్నారు. 


వక్ఫ్‌భూముల ఆక్రమణదారులపై చర్యలు 

జిల్లాలోని వక్ఫ్‌ భూముల ఆక్రమణదారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో వక్ఫ్‌భూముల పరిరక్షణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని వక్ఫ్‌ ఆస్తుల కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.  

Updated Date - 2021-12-08T06:43:37+05:30 IST