అనుకున్నదొక్కటి...అయ్యిందొకటి

ABN , First Publish Date - 2021-12-25T07:04:36+05:30 IST

వారొకటి తలిస్తే ఆ పైవాడు మ రొకటి తలిచాడు. దీంతో వారి పరిస్థితి అనుకున్నదొక్కటి.. అయ్యిందొకటి అన్న చందంగా మారింది.

అనుకున్నదొక్కటి...అయ్యిందొకటి
ఎఫ్‌సీఐ గోదాము ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులు

ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐల చెల్లింపులకై నిరసిస్తే... ఉన్న సీట్లకే ఎసరు 

గొల్లగూడ ఎఫ్‌సీఐ గోదాంలో హమాలీ కార్మికులకు విచిత్ర పరిస్థితి 

నల్లగొండటౌన, డిసెంబరు 24: వారొకటి తలిస్తే ఆ పైవాడు మ రొకటి తలిచాడు. దీంతో వారి పరిస్థితి అనుకున్నదొక్కటి.. అయ్యిందొకటి అన్న చందంగా మారింది. ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సక్రమంగా చెల్లించకపో వడంతో పాటు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఎఫ్‌సీఐ గోదాంలో పనిచేసే కార్మికులంతా ఆందోళనబాట పట్టారు. దీంతో విష యం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్‌ నిబంధనల పేరుతో కనెర్ర చే య డంతో కార్మికులకు విధి లేక తిరిగి కాంట్రాక్టర్‌ చెప్పినట్లు విని విధుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... జిల్లా కేంద్రంలోని గొ ల్లగూడెం ఎఫ్‌సీఐ గోదాంల్లో 30ఏళ్లుగా సుమారు 320 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి వారు పనిచేసే పనిని బట్టి బస్తాకు రూ.4 చొప్పున లెక్క కట్టి నెలనెలా వేతనం చెల్లిస్తారు. వారికి చెల్లించే వేతనంలో కొంత మొత్తాన్ని కాంట్రాక్టర్‌ ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ రూపంలో క ట్‌ చేసి దానికి మరికొంత మొత్తాన్ని సదరు కాంట్రాక్టర్‌ కార్మికుల ఖా తాల్లో జమ చేస్తారు. కొంతకాలంగా ఈ ప్రక్రియ సజావుగానే సాగుతూ వస్తుంది. ఈ ఏడాది జూలైలో కొత్తగా కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్‌ మొదట్లో సక్రమంగానే ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ కట్టినా నాలుగు నెలలుగా  సొమ్ము కార్మికుల ఖాతాల్లో జమ కావడం లేదు. కార్మికుల వేతనాల నుంచి ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్ము కట్‌ చేస్తున్నా కాంట్రాక్టర్‌ వారి ఖాతాల్లో జమ చేయకపోవడాన్ని కార్మికులు తీవ్రంగా పరిగణించారు. అదేవిధంగా రెండున్నర నెలలుగా రావాల్సిన వేతన బకాయిలు కూడా వెంటనే చెల్లించి నెలనెలా సక్రమం గా వేతనాల చెల్లింపు కోసం కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకురా వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం హమా లీ కార్మికులంతా విధులను బహిష్కరించి మూకుమ్మడిగా  ని రసన తెలిపారు. విషయం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్‌ తనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఫలితంగా శుక్రవారం ఏ హమాలీ కార్మికుడు కూడా విధులకు హాజరుకాకుండా గోదాం ప్రధాన గేట్‌ వద్దే అడ్డుకునేలా చేశారు. దీంతో కార్మికులకు సంబంధించిన ముఠా మేస్త్రీలు సంబంధిత కాంట్రాక్టర్‌ను సంప్రదించగా రూల్స్‌, రెగ్యులేషన్స అంటూ నిబంధనలు తెలపడంతో కార్మికులు చేసేదేమీ లేక చివరకు ట్రేడ్‌ యూనియన్లను ఆశ్రయించారు. ట్రేడ్‌ యూనియన నాయకులు మేస్త్రీలతో భేటీ అయి చర్చించి కాంట్రాక్టర్‌తో సంప్రదించి చర్చలు జరిపారు. అనంతరం కాంట్రాక్టర్‌ తాను ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలప డంతో కార్మికులు సోమవారం నుంచి తిరిగి యథావిధిగా విధుల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. 


Updated Date - 2021-12-25T07:04:36+05:30 IST