పట్టుదలతో పనిచేస్తేనే సకల విజయాలు
ABN , First Publish Date - 2021-12-15T06:14:14+05:30 IST
పట్టుదలతో పనిచేస్తేనే స కల విజయాలు కలుగుతాయని పేదరికం, సమస్యలు అడ్డురావని నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.రాజేశ్వరరావు అన్నారు.

నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ రాజేశ్వరరావు
నల్లగొండ క్రైం, డిసెంబరు 14: పట్టుదలతో పనిచేస్తేనే స కల విజయాలు కలుగుతాయని పేదరికం, సమస్యలు అడ్డురావని నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.రాజేశ్వరరావు అన్నారు. పోటీల పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కు మంగళవారం పట్టణంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన అ వగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు డిగ్రీ నుంచే లక్ష్యాలను నిర్ణయించుకోవాలని, వి జయం సాధించేందుకు కష్టపడాలని సూచించారు. డిగ్రీ చదివే స మయం నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన క లిగి ఉండాలని అన్నారు. గ్రంథాలయాల్లో క్రమం తప్పకుడా పుస్తకాలతో పాటు పత్రికలు, జర్నల్స్, పక్ష, మాస పత్రికలను సైతం అధ్యయనం చేయాలని, సమయాన్ని వృథా చేయకుండా కష్టపడాలని సూచించారు. విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడు తూ ఎన్జీ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ప్రతీ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నారని, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు వారి సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కొల్లోజు చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాశాల పూర్వ వి ద్యార్థులు ఈ కళాశాలకు గొప్ప సంపద అని, కళాశాల ప్రతిష్ఠను నలుదిక్కులా వ్యాపింపజేస్తున్నారని పేర్కొన్నారు. సదస్సులో మ హిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఘనశ్యాం, విశ్రాంత అధికారులు, అధ్యాపకులు నరేందర్‌రెడ్డి, ఎంవీ గోనారెడ్డి, ఏదుళ్ల అంజిరెడ్డి, సుంకరి రాజారాం, మునీరు, శ్రీనివాసులు, నాగరాజు, సుబ్బారావు, భిక్షమయ్య, కృష్ణకౌండిన్య, అశోక్ మోరె, దీపిక, లవేందర్‌రెడ్డి, దుర్గాప్రసాద్, నందకుమార్, జయప్రకాష్, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.