వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-12-30T16:44:39+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని దేవరకొండ మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ అన్నారు.

వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

దేవరకొండ, డిసెంబరు 29: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని దేవరకొండ మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ అన్నారు. రైతుబంధు పథకంలో భా గంగా యాసంగి పంట పెట్టుబడి సహాయం అందించినందుకు  బుధవారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో డివిజన్‌లోని పలు మండలా ల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. యాసంగి పంట పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం రైతు ఖా తాల్లో ఇప్పటికే రూ.7645 కోట్లు విడుదల చేసిందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు టీవీఎన్‌రెడ్డి, ఎంపీపీ జాన్‌యాదవ్‌, జడ్పీటీసీ అరుణసురే్‌షగౌడ్‌, రైతుబంధు అధ్యక్షుడు కృష్ణయ్య, వైస్‌చైర్మన్‌ సుభా్‌షగౌడ్‌, నాయకులు పాల్గొన్నారు. 

 

కొండమల్లేపల్లి:  రైతుల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్‌ దే వుడని, రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేసినందుకుగాను కొండమల్లేపల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమావత్‌ దస్రునాయక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు గుండెబోయిన లింగంయాదవ్‌, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివా్‌సయాదవ్‌, శ్రీను, శంకర్‌నాయక్‌, గంధం సురేష్‌, దీప్లాల్‌, సాయి, తులసినాయక్‌ పాల్గొన్నారు. 

 

పెద్దఅడిశర్లపల్లి: మండలంలోని అంగడిపేట స్టేజీ వద్ద  ఎంపీపీ వంగాల ప్రతా్‌పరెడ్డి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ సిరసువాడ శ్రీ నయ్య, అంజిరెడ్డి, శీలం శేఖర్‌రెడ్డి, నక్క రాములు, ఏడుకొండలు యాదవ్‌, ముత్యపురావు, మహేందర్‌, శ్రీనివాస్‌, నర్సింహ, ఎర్ర యాదగిరి, కర్ణయ్య, డీలర్‌ శ్రీను, స్వామి నాయక్‌, రవి, వెంకట య్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T16:44:39+05:30 IST