టీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే బలం: గుత్తా

ABN , First Publish Date - 2021-10-28T05:41:58+05:30 IST

ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే కొండంత బలమని శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే బలం: గుత్తా
సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి

మిర్యాలగూడ, అక్టోబర్‌ 27: ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే  కొండంత బలమని  శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎస్వీఆర్‌ గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన విజయగర్జన సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.  గ్రామ స్థాయిలో పార్టీ పటిష్ఠంగా ఉంటేనే ప్రభుత్వం మరింత బలంగా సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ గ్రామ శాఖల అధ్యక్షులు, సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని విజయగర్జన సభకు కార్యకర్తలను తరలించాలన్నారు. వరంగల్‌ సభకు నియోజకవర్గం నుంచి 160 బస్సుల్లో 9000 మంది కార్యకర్తలు సభకు తరలివెళ్లేలా చూడాలన్నారు. సకాలంలో సభకు హాజరయ్యేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, ఎంిపీపీ నూకల సరళా హన్మంతరెడ్డి, నాయకులు చింతిరెడ్డి శ్రీనావాసరెడ్డి, చిట్టిబాబునాయక్‌, కుర్ర విష్ణు,  బాలునాయక్‌, నందిని రవితేజ, మట్టపల్లి సైదులు, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి,  దుర్గంపూడి నారాయణరెడ్డి,  కురాకుల చిన రామయ్య, పాలుట్ల బాబయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:41:58+05:30 IST