విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-11-26T06:46:05+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్‌ జిల్లా అధికారి జ్యోతిపద్మ అన్నారు. కోదాడ డివిజన్‌ పరిధిలోని పలు అంగన్‌వాడీకేంద్రాలను గురువారం ఆమె పరిశీలించి రికార్డులను తనిఖీచేశారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న జ్యోతిపద్మ

కేంద్రాలు పనిచేయకపోవడం సూపర్‌వైజర్ల నిర్లక్ష్యమే

ఐసీడీఎస్‌ జిల్లా అధికారి జ్యోతిపద్మ


మేళ్లచేర్వు, నవంబరు 25: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  ఐసీడీఎస్‌ జిల్లా అధికారి జ్యోతిపద్మ అన్నారు. కోదాడ డివిజన్‌ పరిధిలోని పలు అంగన్‌వాడీకేంద్రాలను గురువారం ఆమె పరిశీలించి రికార్డులను తనిఖీచేశారు. క్లస్టర్‌ పరిధిలోని పలువురు సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లపై చర్యలకు రాష్ట్ర కమిషనర్‌, కలెక్టర్‌కు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా జ్యోతిపద్మ మాట్లాడుతూ మేళ్లచెర్వు, రామాపురం క్లస్టర్లలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ సరిగాలేదని, టీచర్ల నిర్లక్ష్యాన్ని గుర్తించామన్నారు. పౌష్టికాహారం పంపిణీ, ఆరోగ్యలక్ష్మీ పథకాల అమలు తీరు బాగోలేదన్నారు. ప్రభుత్వ పథకాలు పక్కదారి పడుతున్నాయని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన ఆహారం పంపిణీ చేయడం లేదని ఫిర్యాదులు అందాయని, తనిఖీల్లో కూడా బయటపడిందన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, సూపర్‌వైజర్ల నిర్లక్ష్యం మూలంగానే అంగన్‌వాడీ కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయ న్నారు. తల్లులు, చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లు, సూపర్‌వైజర్లేదనన్నారు. ఆమెవెంట సూపర్‌వైజర్లు, టీచర్లు ఉన్నారు.  

Updated Date - 2021-11-26T06:46:05+05:30 IST