పేరుకుపోయిన బకాయిలు

ABN , First Publish Date - 2021-05-02T06:47:30+05:30 IST

చౌటుప్పల్‌ మునిసిపాలిటీ ఆధీనంలోని కూరగాయల మార్కెట్‌లోని దుకాణదారులు రూ.1. 20కోట్లు అద్దెను బకాయిపడ్డారు. 57 నెలలుగా అద్దె చెల్లించకుండ మునిసిపల్‌ ఆదాయానికి గండి పడుతున్నా దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తగిన కార్యాచరణను సిద్ధం చేశారు. దీంతో పాటు బహిరంగ వేలం పాట ద్వారా దుకాణాలను కేటాయించి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ప్రణాళికను రూపకల్పన చేశారు. కాగా, మునిసిపల్‌ ఆదాయానికి కూరగాయల దుకాణదారులు గం డి పెడుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్న మునిసిపల్‌ అధికారులపై ప్రభుత్వం తగిన చ ర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

పేరుకుపోయిన బకాయిలు

 చౌటుప్పల్‌ మునిసిపాలిటీకి రూ.1.20కోట్లు అద్దె బకాయి

 57నెలలుగా చెల్లించని దుకాణదారులు

 చోద్యం చూస్తున్న అధికారులు

చౌటుప్పల్‌ మునిసిపాలిటీ ఆధీనంలోని కూరగాయల మార్కెట్‌లోని దుకాణదారులు రూ.1. 20కోట్లు అద్దెను బకాయిపడ్డారు. 57 నెలలుగా అద్దె చెల్లించకుండ మునిసిపల్‌ ఆదాయానికి గండి పడుతున్నా దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తగిన కార్యాచరణను సిద్ధం చేశారు. దీంతో పాటు బహిరంగ వేలం పాట ద్వారా దుకాణాలను కేటాయించి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ప్రణాళికను రూపకల్పన చేశారు. కాగా, మునిసిపల్‌ ఆదాయానికి కూరగాయల దుకాణదారులు గం డి పెడుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్న మునిసిపల్‌ అధికారులపై ప్రభుత్వం తగిన చ ర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

- చౌటుప్పల్‌ టౌన్‌

కూరగాయల మార్కెట్‌లోని 37మంది దుకాణదారులు ఒక కోటీ 20 లక్షల రూపాయల అద్దెను మునిసిపాలిటీకి చెల్లించవలసి ఉంది. 2016 ఏప్రిల్‌ మాసంలో 37కూరగాయల దుకాణాల నిర్వహణకు అప్పటి గ్రామ పంచాయతీ పాలకవర్గం బహరంగ వేలం నిర్వహించింది. వేలంలో దుకాణాలను పొంది న 37మంది వ్యాపారులకు 2016 ఆగస్టు 1 నుంచి 2019 మార్చి 31 వరకు నిర్దేశిత వ్యాపారాలు చేసుకునేందుకు  కేటాయించారు. ఇందులో 19హోల్‌సేల్‌ కూరగాయల దుకాణాలు, 9రిటైల్‌ కూరగాయల దు కాణాలు, 5ఎండు చేపల దుకాణాలు, 4 పచ్చి చేపల దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణదారులు మొత్త కలిపి నెలకు రూ.2,10,000లచొప్పున 2021 ఏప్రిల్‌ 30వరకు 57 నెలల అద్దెను చెల్లించవలసి ఉంది.

ఫైనల్‌ నోటీస్‌ జారీ 

గ్రామ పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా మా రిన అనంతరం అద్దె చెల్లింపు కోసం మూడు పర్యాయాలు కూరగాయల దుకాణదారులకు మునిసిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. చివరగా 2020 డిసెంబరు 8న ఫైనల్‌ నోటీస్‌ జారీ చేశారు. ఫైనల్‌ నోటీ్‌స తీసుకునేందుకు దుకాణదారులు నిరాకరించడంతో ప్రవేశ ద్వారం వద్ద అతికించ వలసి వచ్చింది.

నెలకు రూ.25వేల నుంచి రూ.50వేలు అద్దె

ప్రస్తుతం పెరిగిన మార్కెట్‌ ధరల ప్రకా రం కూరగాయల మార్కెట్‌లోని దుకాణాల కు 25 వేల నుంచి 50వేల రూపాయల చొప్పున అద్దె వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే నెలకు సుమారుగా రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇతర వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 2016 ఏప్రిల్‌లో వేసిన బహిరంగ వేలం ప్రకారం ఒక్కో దుకాణానికి సరాసరిగా రూ.5000నుంచి రూ.6000  చొప్పున నిర్ణయించారు. దీని ప్రకారంగా నెలకు రూ.2,10,000అద్దె వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక నెల అద్దె కూడా మునిసిపాలిటీకి దుకాణదారులు చెల్లించ లేదు.

మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్యం

కూరగాయల దుకాణదారుల నుంచి పెండింగ్‌ అద్దెను వసూలు చేయడంలో మునిసిపల్‌ అధికారు లు తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.   దుకాణదారుల నుంచి పెండింగ్‌ అద్దెను వసూలు చేయడంతో పాటు తక్షణమే బహిరంగ వేలం పాట నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

వేలం పాట నిర్వహించకూడదు

కూరగాయల మార్కెట్‌లోని దుకాణాల అద్దె ఖరారుకు బహిరంగ వేలం పాట నిర్వహించకూడదు. గతంలోని గ్రామ పంచాయతీ పాలకవర్గాల మాదిరిగానే కొద్ది కొద్దిగా అద్దెను పెంచాలి తప్ప వేలం పాటకు అంగీకరించబోం. ప్రభుత్వ భూమిలో వేసిన ఈ దుకాణాలను శాశ్వతంగా మాకే అప్పగించాలి. 

- పిల్లలమర్రి యాదగిరి, అధ్యక్షుడు, కూరగాయల మార్కెట్‌ చౌటుప్పల్‌ 

వంద దుకాణాలకు విస్తరిస్తాం

కూరగాయల మార్కెట్‌ను వంద దుకాణాలకు విస్తరించి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. దీంతో అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ విస్తరణ మార్కెట్‌తో సంవత్సరానికి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం రానుంది. ప్రస్తుతం ఉన్న 37 దుకాణాలతో పాటుగా కొత్త దుకాణాలకు త్వరలోనే మునిసిపల్‌ చట్టం ప్రకారంగా  బహిరంగ వే లం నిర్వహించి,  అధికంగా అద్దె పాట పాడిన వారికి కేటాయిస్తాం. ప్రస్తుతం ఉన్న దుకాణాదారుల నుంచి పెండింగ్‌ అద్దెను చట్ట ప్రకారంగా వసూలు చేస్తాం. ఈ విషయాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాను. ఒత్తిళ్లు ఎన్ని వచ్చినా దుకాణాల అద్దె ఖరారుకు వేలం పాటలు నిర్వహించి తీరుతాం.

- వెన్‌రెడ్డి రాజు, చైర్మన్‌, చౌటుప్పల్‌ మునిసిపాలిటీ

Updated Date - 2021-05-02T06:47:30+05:30 IST