ధాన్యం కొనుగోళ్లలో వేగంపెంచాలి
ABN , First Publish Date - 2021-11-28T05:58:09+05:30 IST
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లకు, జిల్లా పోలీసు అధికారులకు సూచించారు.
భువనగిరి రూరల్, నవంబరు 27: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లకు, జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుం చి ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ప్రిన్సిపాల్ సెక్రటరీ రామకృష్ణ, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్‌రావుతో కలిసి శనివారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా కొనుగోలుకేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ర్టాలనుంచి ధాన్యం రాకుండా, దళారీ వ్యవస్థ లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వచ్చే యాసంగిలో వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంటల సాగు పద్ధతులు, ఎరువులు తదితర విషయాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇతర రాష్ర్టాల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలుచేసి తమ రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అక్రమ రవాణా అరికట్టాలని, సరిహద్దు ఉమ్మడి జిల్లాల పోలీసు, రెవెన్యూ అధికారులు బృందంగా ఏర్పడి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు డి.శ్రీనివా్‌సరెడ్డి, దీపక్‌తివారీ, డీసీపీ నారాయణరెడ్డి, డీసీఎ్‌సవో బ్రహ్మారావు, డీఏవో కె.అనురాధ, డీసీవో పరిమల దేవి, పౌరసరఫరాల డీఎం గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.