ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

ABN , First Publish Date - 2021-12-30T06:42:07+05:30 IST

కోదాడ మండలంలోని కూచిపూడి గ్రామ ఉప సర్పంచ్‌ హుస్సేన్‌బీ చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

కోదాడ రూరల్‌, డిసెంబరు 29: కోదాడ మండలంలోని కూచిపూడి గ్రామ ఉప సర్పంచ్‌ హుస్సేన్‌బీ చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో రూ.8 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు డ్రా చేసేందుకు చెక్కులపై సంతకాలు చేయకుండా ఇబ్బంది పెడుతోందని సర్పంచ్‌ శెట్టి సురేష్‌ ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసిన కలెక్టర్‌, ఉప సర్పంచ్‌ చెక్‌పవర్‌ను రద్దు చేశారు. ఆమె స్థానంలో మండల పంచాయతీ అధికారికి అధికారం కల్పిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 


Updated Date - 2021-12-30T06:42:07+05:30 IST