నిజాయితీని చాటిన యువకుడు

ABN , First Publish Date - 2021-05-20T06:01:07+05:30 IST

దొరికిన సెల్‌ఫోన్‌ను ఓ యువ కుడు అందజేసి నిజాయితీని చాటుకున్నాడు.

నిజాయితీని చాటిన యువకుడు
జడ్పీటీసీ సమక్షంలో రమేష్‌కు సెల్‌ఫోన్‌ను అందజేస్తున్న శంకర్‌(ఎడమ వైపు వ్యక్తి)

మఠంపల్లి, మే 19: దొరికిన సెల్‌ఫోన్‌ను ఓ యువ కుడు అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. బాడవతండాకు చెందిన ధరావత్‌ రమేష్‌ భీల్యానాయక్‌తండాకు వెళ్లి సెల్‌ఫోను పోగొట్టుకోగా, అది నిమ్మతండాకు చెందిన ధరావత్‌ శంకర్‌కు దొరికింది. ఫోన్‌లో నెంబరు ఆధారంగా డయల్‌ చేయగా జడ్పీటీసీ జగన్‌నాయక్‌కు వెళ్లడంతో ఆ ఫోన్‌ తనకు పరిచయమున్న రమే్‌షదని చెప్పాడు. శంకర్‌ జడ్పీటీసీని కలిసి బాధితుడు రమేష్‌ సెల్‌ఫోన్‌ను అందజేశారు.దీంతో శంకర్‌ నిజాయితీని జడ్పీటీసీ, పలువురు అభినందించారు. 

Updated Date - 2021-05-20T06:01:07+05:30 IST