పొలాల్లోకి దూసుకెళ్లిన పోలీస్‌ వాహనం

ABN , First Publish Date - 2021-09-02T06:55:04+05:30 IST

రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. కొద్దిదూరంలో బురద ఉండడంతో అందులో వాహనం ఇరుక్కుని పెను ప్రమాదం తప్పి ంది. మండలంలోని కమ్మగూడెంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. మండలంలోని నాగారం-ఇంద్రపాలనగరం గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్డుకు మర

పొలాల్లోకి దూసుకెళ్లిన పోలీస్‌ వాహనం
కమ్మగూడెం వద్ద పొలం సమీపంలోని కందకంలోకి దూసుకెళ్లిన పోలీసు వాహనం

ఆందోళనకారులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళుతుండగా ఘటన 

వలిగొండ, సెప్టెంబరు 1: రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. కొద్దిదూరంలో బురద ఉండడంతో అందులో వాహనం ఇరుక్కుని పెను ప్రమాదం తప్పి ంది. మండలంలోని కమ్మగూడెంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. మండలంలోని నాగారం-ఇంద్రపాలనగరం గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక బీజేపీ నాయకులు బుధవారం రాస్తారోకో చేశారు. రోడ్డు పూ ర్తిగా దెబ్బతినడడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వెంటనే రోడ్డు నిర్మించాలని నినాదాలు చేశారు. రాస్తారోకోతో వలిగొండ-చిట్యాల రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభిం చడంతో ఇరుపైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టుచేసి వాహనంలో ఎక్కించి, వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించే క్రమంలో కమ్మగూడెం నుంచి కిలోమీటరు దూరం వెళ్లిన వాహనం నాగారానికి కొద్దిరూరంలో పక్కనే ఉన్న పొలాల ముందున్న కందకంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రదే శంలో వర్షం నీరు, బురద ఉండడంతో అక్కడే ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అరెస్టు చేసి వారిలో ఓ వ్యక్తి వాహనం స్టీరింగ్‌ను ఒకవైపు తిప్పడంతో అదుపు తప్పి, పొలాల్లోకి వాహనం దూసుకెళ్లిందని పోలీసులు వెల్లడించారు. పోలీసు విధులకు ఆటంకం కల్పించినందున పల్లపు దుర్గయ్య, బోనగిరి సాయికుమార్‌, గండికొట సాయి కుమార్‌, హరికృష్ణ, వడ్లకొండ వెంకటేష్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. 

ప్రాణాలు పోతున్నా రోడ్డు మరమ్మతులు చేయరా? : బీజేపీ

ప్రజల ప్రాణాలు పోతున్నా రహదారికి ఎందుకు మరమ్మతులు చేయడంలేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వలిగొండ మండలం నాగారం-ఇంద్రపాలనగరం  గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేస్తూ కమ్మగూడెం వద్ద బీజేపీ నాయకులు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత పల్లపు దుర్గయ్య మాట్లాడుతూ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమైందని, రాత్రివేళ ప్రయాణం చేయాలంటే వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారన్నారు.రోడ్డు దుస్థితిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. 

Updated Date - 2021-09-02T06:55:04+05:30 IST