కోదాడ, ఖమ్మం మధ్య నాలుగు లేన్ల రహదారి
ABN , First Publish Date - 2021-11-11T06:10:17+05:30 IST
కోదాడ, ఖమ్మం మధ్య నాలుగు లేన్ల రహదారి పనుల ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నేషనల్ హై వేఆఫ్ ఆథారిటీ భూ నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం అందజేసింది. సాంకేతిక సమస్యలు కూడా తొలగిపోయాయి. వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభం కానున్నాయి.
వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభం
జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని దుర్గాపురం వద్ద రింగు రోడ్డు
కోదాడ, నవంబరు 10: కోదాడ, ఖమ్మం మధ్య నాలుగు లేన్ల రహదారి పనుల ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నేషనల్ హై వేఆఫ్ ఆథారిటీ భూ నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం అందజేసింది. సాంకేతిక సమస్యలు కూడా తొలగిపోయాయి. వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభం కానున్నాయి. ఖమ్మం, సూర్యాపేట రహదారిపై కోదాడ రహదారి నుంచి, 65వ జాతీయ రహదారి కోదాడ సమీపంలోని దుర్గ్గాపురం వరకు 31 కిలో మీటర్లు నాలుగు లేన్ల రోడ్డు నిర్మించ నున్నారు. పనులు పూర్తయ్యేందుకు మూడు సంవత్సరాలు పట్టనుంది. నాలుగు లేన్ల రోడ్డు కోదాడ సమీపంలోని దుర్గపురం వద్ద రింగ్‌రోడ్డు, కోదాడ, ఖమ్మం రహదారిపై బొజ్జగూడెం స్టేజీ దాటగానే రైస్‌మిల్లుల వద్ద కలుస్తుంది. అదే రహదారిపై పైనంపల్లి ఊరు దాటగానే టోల్‌ప్లాజా ఉంటుంది. పైనంపల్లి, కొండపల్లి గ్రామాల రోడ్డు వద్ద బైపా్‌సలతో రహదారి నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వాహనదారులు కల నెరవేరనుంది. రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖ వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు, విజయవాడతో సంబంధంలేకుండా నేరుగా ప్రయాణించవచ్చు.