ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే మానవ మనుగడ
ABN , First Publish Date - 2021-12-30T06:38:21+05:30 IST
ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే మానవ మనుగడ సాధ్యమని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్త, స్వచ్ఛత ప్రోగ్రాం కోఆర్డినేటర్ లవకుమార్ అన్నారు.

గరిడేపల్లి కేవీకే శాస్త్రవేత్త లవకుమార్
గరిడేపల్లి రూరల్, డిసెంబరు 29: ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే మానవ మనుగడ సాధ్యమని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్త, స్వచ్ఛత ప్రోగ్రాం కోఆర్డినేటర్ లవకుమార్ అన్నారు. స్వచ్ఛత పక్షోత్సవాలు సంద ర్భంగా ప్లాస్టిక్ వినియోగంపై విద్యార్థులకు కేవీకేలో బుఽధవారం నిర్వహిం చిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 15రోజుల పాటు స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్, ఆదర్శ్, మాధురి, విద్యార్థులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత పాటించాలి: నరేష్
సూర్యాపేట రూరల్: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని కేవీకే ప్రొగ్రాం ఇన్‌చార్జి ఆకుల నరేష్ అన్నారు. గడ్డిపల్లి అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కాసరబాద గ్రామంలో ర్యాలీ నిర్వహించిన పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భగవత్ యూనివర్సిటీ ఆజ్మీర్ విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో బత్తుల లింగమూర్తి, వెంకటేష్, విద్యార్థులు సంతోష్, సాయికిశోర్, రవి, నజీర్, రామకృష్ణ, శివ, మేఘన, దీప్తి, అమూల్య, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.