రైతులపై కక్షగట్టిన కేంద్రం

ABN , First Publish Date - 2021-11-09T06:59:58+05:30 IST

రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలుచేసేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని అవలంబిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

రైతులపై కక్షగట్టిన కేంద్రం
కొండమల్లేపల్లి : చిన్న అడిశర్లపల్లి గ్రామపంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

రైతులపై కక్షగట్టిన కేంద్రం

ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

డిండి/ కొండమల్లేపల్లి/ పెద్దఅడిశర్లపల్లి/ కనగల్‌, నవంబరు 8:  రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలుచేసేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని అవలంబిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మండలంలోని తవక్లాపూర్‌, డిండి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫుడ్‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. యాసంగిలో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వానా కాలం సాగుచేసిన వరిని కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు పంట పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబోసి, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.  మండలంలో మరికొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతజనార్ధన్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్లు నాగార్జునరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, మేకల సాయమ్మ, కోఆఫ్షన్‌ సభ్యులు జాహంగీర్‌, డీటీ ప్రశాంత్‌, మల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, శిరందాసు కృష్ణయ్య, వంగాల బాల్‌రెడ్డి, వంగాల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.  కొనుగోలు కేంద్రానికి ఆరబోసిన ధాన్యం మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మండల పరిధిలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుచేసే కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ దూదిపాల వేణుధర్‌రెడ్డి, రైతుసమన్వయసమితి అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, శిరందాసు కృష్ణయ్య, మేకల శ్రీనివా్‌సయాదవ్‌, సర్పంచ్‌లు కుంభం శ్రీనివా్‌సగౌడ్‌, గడ్డం శ్రీరాములు, లింగం యాదవ్‌, అబ్బనబోయిన శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమావత్‌ దస్రునాయక్‌, జిల్లా నాయకుడు నే నావత్‌ రాంబాబు, అబ్బనబోయిన శ్రీను, ఉటుకూరి వేమన్‌రెడ్డి, వస్కుల కాశయ్య, అందుగుల ముత్యాలు, భీంసింగ్‌, గంధం సురేష్‌ పాల్గొన్నారు. పీఏపల్లి మండల పరిధిలోని అంగడిపేట ఎక్స్‌రోడ్డు, ఘనపురం గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.  కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య,  ఎంపీపీ వంగాల ప్రతా్‌పరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వల్లపురెడ్డి, వైస్‌ చైర్మన్‌ సిరసువాడ శ్రీనయ్య, మార్కెట్‌ డైరెక్టర్‌ ఎర్ర యాదగిరి ,ఎంపీటీసీ మద్దిమడుగు కళమ్మకర్ణయ్య, నర్సింహ, పరమేష, లచ్చిరెడ్డి, గురుప్రసాద్‌, అమరేందర్‌ రవి, సంగు  పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేస్తోందని  ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. కనగల్‌ మండలంలోని  జి.చెన్నారం, రసూల్‌పురం, కొత్తపల్లి, ముషంపల్లి, నర్సింగ్‌బట్ల, అప్పాజీపేటతోపాటు ఇతర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పిఎసీఎస్‌ చైర్మన్‌ ఆలకుంట్ల నాగరత్నంరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉప్పునూతల వెంకన్నయాదవ్‌, మల్లేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బకరం వెంకన్న, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, యన్నం నర్సిరెడ్డి, విజయ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T06:59:58+05:30 IST