50వేల మొక్కలు నాటాలి : జడ్పీ సీఈవో
ABN , First Publish Date - 2021-07-24T06:17:56+05:30 IST
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 24న మండలంలోని జాతీయ రహదారుల వెంట ఇరువైపులా 50వేల మొక్కలు నాటాలని జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి సూచించారు.

అర్వపల్లి, జూలై 23 : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 24న మండలంలోని జాతీయ రహదారుల వెంట ఇరువైపులా 50వేల మొక్కలు నాటాలని జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన ఎంపీపీ మన్నె రేణుకతో కలిసి జాజిరెడ్డిగూడెంలో నకిరేకల్-తానంచర్ల జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే ప్రదేశాలను పరిశీలించి మాట్లాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉపాధి హామీ కూలీలు ఇందులో పాల్గొని సూర్యాపేట- జనగాం, నకిరేకల్- తానంచర్ల జాతీయ రహదారుల వెంట రోడ్డుకు ఇరువైపులా 40కిలోమీటర్ల మేర 52,473మొక్కలు నాటాలన్నారు. మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ప్రతీ మండల పరిధిలోని రోడ్ల వెంట ఉపాధి కూలీలతో మొక్క లు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, ఎంపీడీవో ఉమేష్, ప్రత్యేకాధికారి సురేష్, ఏపీవో శైలజ, ఈసీ నగేష్, అధికారులు పాల్గొన్నారు.
మద్దిరాల : మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని 365 జా తీయ రహదారికి ఇరువైపులా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఏపీడీ రాజు కోరారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో జాతీయ రహదారి కి ఇరువైపులా తీసిన గుంతలు పరిశీలించి మాట్లాడారు.
నూతనకల్ : మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని మండల పరిధిలోని బిక్కుమల్ల గ్రామ శివారులో ప్రారంభించడానికి మంత్రి జగదీ్‌షరెడ్డి రానున్నట్లు ఎంపీడీవో ఇందిర తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లారు.