నల్లగొండ జిల్లాలో 42కిలోల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-29T06:06:03+05:30 IST
నల్లగొండ జిల్లాలో గురువారం నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు 42కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ పట్టణ పరిధిలోని మర్రిగూడ బైపాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతు
నల్లగొండ, చిట్యాలలో పట్టుకున్న పోలీసులు
నల్లగొండ క్రైం/ చిట్యాల, అక్టోబరు 28: నల్లగొండ జిల్లాలో గురువారం నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు 42కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ పట్టణ పరిధిలోని మర్రిగూడ బైపాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా డబ్బకోటకు చెందిన కరుణం దారాబాబు, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం జల్మాల్‌కుంటతండాకు చెందిన దారావత్ గణేష్, అదే మండలం లాల్‌తండాకు చెందిన భూక్య రాములను రూరల్ ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 20కిలోల గంజాయి లభించింది. నింది తులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితులకు సంబంఽధించిన మూడు సెల్‌ఫోన్లు, రూ.1100 నగదు సీజ్ చేసినట్లు పోలీ సులు తెలిపారు. అదేవిధంగా చిట్యాల రైల్వేస్టేషన్ వద్ద జాతీయ రహదా రిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి సంచులతో అను మానాస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకున్నారు. సంచులను తనిఖీ చేయగా 22కిలోల గంజాయి లభించింది. నిందితుడిని అదిలాబాద్ జిల్లా ఊట్నూర్‌కు చెందిన జాదవ్‌రాహుల్‌గా గుర్తించినట్లు సీఐ శంకర్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డొంకరాయ నుంచి బస్సులో హైదరాబాద్‌కు గం జాయి తరలిస్తున్నట్లు తెలిపారు. రెండు ప్రాంతాల్లో లభించిన 42కిలోల గం జాయి విలువ సుమారు రూ.2.60లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.