దసరా వరకు 382 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు

ABN , First Publish Date - 2021-09-02T06:51:56+05:30 IST

దసరా నాటికి ఆలేరు నియోజవకవర్గ వ్యాప్తంగా 382 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. గుట్టలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆలేరులో 64, కొలనుపాక 64, వంగపల్లి 40, మాసాయిపేట40, ఆత్మకూర్‌ మండలకేంద్రంలో 48, ఉప్పల్‌పహాడ్‌ 45, మోటకొండూర్‌ 40, తుర్కపల్లి 40మొత్తం 382

దసరా వరకు 382 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ సునీతామహేందర్‌రెడ్డి

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 

యాదాద్రి రూరల్‌, సెప్టెంబరు 1: దసరా నాటికి ఆలేరు నియోజవకవర్గ వ్యాప్తంగా 382 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. గుట్టలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆలేరులో 64, కొలనుపాక 64, వంగపల్లి 40, మాసాయిపేట40, ఆత్మకూర్‌ మండలకేంద్రంలో 48, ఉప్పల్‌పహాడ్‌ 45, మోటకొండూర్‌ 40, తుర్కపల్లి 40మొత్తం 382 ఇళ్లు పూర్తవుతాయని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణానికి 100 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు మంజూరయ్యాయని, స్థలం లేక జాప్యం జరుగుతోందన్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వా రికి మండలంలోని సైదాపురం గ్రామ సమీపంలో కేటాయించామని అక్కడనే మరో ఆరు ఎకరాల స్థలం కోసం కలెక్టర్‌ ద్వారా వైటీడీఏ చైర్మన్‌ కిషన్‌రావుకు దరఖాస్తు చేయాలని కోరగా ఇప్పటికే నివేదిక అందజేసినట్లు తెలిపారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేందర్‌గౌడ్‌, కర్రె వెంకటయ్య, వైస్‌చైర్మన్‌ కాటంరాజు, బూడిద సురేందర్‌, వెంకటయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T06:51:56+05:30 IST