317 జీవోను వాయిదా వేయాలి

ABN , First Publish Date - 2021-12-28T06:46:51+05:30 IST

జీవో 317ను వాయిదా వేయాలని పీఆ ర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

317 జీవోను వాయిదా వేయాలి
వినతిపత్రం అందజేస్తున్న ఉమాకర్‌రెడ్డి

పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్‌రెడ్డి

మిర్యాలగూడ, డిసెంబరు 27: జీవో 317ను వాయిదా వేయాలని పీఆ ర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  సోమ వారం హైదరాబాద్‌లో విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన, 317 జీవో నిర్వహణ అ ధికారి లింగయ్యలను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరు 6వ తేదీన విడుదల చేసిన 317 జీ వో వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షా ఐదు వేలమంది ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఉపాధ్యాయుల కోసం తక్షణమే జీవోను వాయిదా వేసి వేసవి సెలవుల్లో నిర్వహించాలన్నారు.  లేనిచో వారం రోజుల పాటు వా యిదా వేసి సీనియారిటీ తయారీలో జరిగిన తప్పులను సరిదిద్దాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల నుంచి తీసుకున్న విజ్జప్తులను పరిశీలించి  జాబి తా రూపొందించాలని కోరారు. కొత్త జిల్లాల్లో ఉన్న క్యాడర్‌ పోస్టులను బ హిరంగపరిచి వాటిని ఉపాధ్యాయులు ఎంచుకునే విధంగా వీలు కల్పించాల న్నారు. 182 జీవో ప్రకారం ఇంటర్‌ డ్రిస్టిక్‌ బదిలీ లు చేపట్టాలని, 2018 రాష్ట్ర పతి ఉత్తర్వులు వ చ్చినా సర్వీస్‌ రూల్స్‌పై ప్రభుత్వం దృష్టి సారిం చనందున సర్వీస్‌రూల్స్‌పై వెంటనే దృష్టి సారిం చాలని కోరారు. 398 స్పెషల్‌ టీచర్ల నోషనల్‌ ఇంక్రిమెంట్‌ను ఇప్పించాలని  వినతిపత్రంలో కో రినట్లు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారి లో పీఆర్‌టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షు డు హర్షవర్ధనరెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షుడు చిం తరెడ్డి లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పేర్కొన్నారు.  


Updated Date - 2021-12-28T06:46:51+05:30 IST