134రోజులు రూ.13.32లక్షల ఆదాయం

ABN , First Publish Date - 2021-08-10T07:04:10+05:30 IST

మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహు డి క్షేత్రంలో హుండీలను సోమవారం దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.మహేందర్‌కుమార్‌ పర్యవేక్షణలో లెక్కించారు.

134రోజులు రూ.13.32లక్షల ఆదాయం
హుండీని లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

మట్టపల్లి లక్ష్మీనృసింహుడి హుండీ లెక్కింపు

మఠంపల్లి, ఆగస్టు 9 : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహు డి క్షేత్రంలో హుండీలను సోమవారం దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.మహేందర్‌కుమార్‌ పర్యవేక్షణలో లెక్కించారు. ఈ ఏడాది మార్చి 26 నుంచి సోమవారం వరకు (నాలుగు నెలల 14రోజులు)గాను రూ.13,32,282లు వచ్చాయని ఆలయ ధర్మకర్తలు చెన్నూ రి విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈవో సరికొండ నవీన్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బందితో పాటు శ్రీసాయి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-10T07:04:10+05:30 IST