నేరేడుచర్లలో 13కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-15T05:13:41+05:30 IST

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 13కిలోలను స్వాధీనం చేసుకున్నట్లు హుజూర్‌నగర్‌ సీఐ వై.రామలింగారెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలోని పర్బాని పట్టణానికి చెందిన కిరణ్‌ సిరి రంగారావు పుండగే(29

నేరేడుచర్లలో 13కిలోల గంజాయి స్వాధీనం

నేరేడుచర్ల, అక్టోబరు 14: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 13కిలోలను స్వాధీనం చేసుకున్నట్లు హుజూర్‌నగర్‌ సీఐ వై.రామలింగారెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలోని పర్బాని పట్టణానికి చెందిన కిరణ్‌ సిరి రంగారావు పుండగే(29) ముంబయిలో ఐస్‌క్రీం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన యువతితో పరి చయమై వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. కరోనా లాక్‌డౌన్‌ సమయం లో ఉపాధి పోవడంతో కిరణ్‌ను సదరు యువతి హైదరాబాద్‌కు పిలిపిం చింది. ఇద్దరూ కలిసి ఒకే లాడ్జీలో ఉంటున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఓ బ్యాగ్‌ తెస్తే రోజుకు రూ.5వేలు ఇస్తానని యువతి చెప్పటంతో అందుకు కిరణ్‌ అంగీకరించాడు. విజయవాడ వెళ్లిన కిరణ్‌కు ఓ వ్యక్తి గం జాయి ఉన్న బ్యాగు, రూ.500 ఇచ్చాడు. ఒకరోజు విజయవాడలోనే ఉన్న కిరణ్‌ పోలీసుల బందోబస్తు దృష్ట్యా నేరేడుచర్ల మీదుగా హైదరాబాద్‌ బ యలుదేరాడు. పోలీసులకు పక్కా సమచారం అందడంతో కిరణ్‌ను నేరేడు చర్లలో అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.70వేలు ఉంటుందని తెలిసింది.

Updated Date - 2021-10-15T05:13:41+05:30 IST