క్రీడల్లో రాణించి దేశానికి పేరు తేవాలి

ABN , First Publish Date - 2021-12-29T05:07:55+05:30 IST

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

క్రీడల్లో రాణించి దేశానికి పేరు తేవాలి

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు


తొగుట, డిసెంబరు 28: మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన తొగుటలో నెహ్రూ యువ కేంద్రం, శివాజీ యూత్‌ గుడికందుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వాలీబాల్‌, కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. యువకులు శరీర ధారుడ్యాన్ని పెంపొందించుకొని క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్‌ నిర్వాహకులు విభీషన్‌రెడ్డి, నెహ్రూ యువకేంద్ర నిర్వాహకులు రంజిత్‌రెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, ఎంపీడీవో మున్నయ్య, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు నంట స్వామిరెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్‌, నరేష్‌, పరమేష్‌, రాజు, నవీన్‌ రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-12-29T05:07:55+05:30 IST