12 గంటల్లోనే..!
ABN , First Publish Date - 2021-02-26T05:45:06+05:30 IST
చిన్నపాటి రోగానికి కూడా పరీక్షలు తప్పనిస రి. వైద్యపరీక్షలు అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇక పేద, మధ్యతరగతి వారు డబ్బు లేక వైద్య పరీక్షలు చేయించుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటారు.

రక్తపరీక్షల ఫలితాలు నేరుగా సెల్‌ఫోన్‌కే
మెరుగైన వైద్యసేవలందిస్తున్న సిద్దిపేటలోని డయాగ్నస్టిక్ సెంటర్
23రోజుల్లో 33వేల మందికి రక్త నమూనాల పరీక్షలు
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుంచే నమూనాల సేకరణ
సిద్దిపేట సిటీ, ఫిబ్రవరి 25: చిన్నపాటి రోగానికి కూడా పరీక్షలు తప్పనిస రి. వైద్యపరీక్షలు అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇక పేద, మధ్యతరగతి వారు డబ్బు లేక వైద్య పరీక్షలు చేయించుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అప్పులు తీసుకొచ్చి మరీ వైద్యపరీక్షలు చేయించుకుందామన్నా గంటల తరబడి వేచిఉండాలి. వాటి ఫలితాల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాలి. ఇలాంటి తరుణంలో సిద్దిపేటలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ పేదలపాలిట వరంగా మారింది. ఈ సెంటర్ ద్వారా అతి తక్కువ సమయంలోనే పరీక్షలు చేయడం, వాటి ఫలితాలు కూడా త్వరగా అందజేయడంలో డయాగ్నస్టిక్ సెంటర్ వైద్యులు కృషి చేస్తున్నారు.
డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుతో గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే గర్భిణులకు మేలు చేకూరినట్లయింది. గ్రామాల్లో ఉండే గర్భిణులు రక్తపరీక్షలు చేయించుకోవాలంటే సిద్దిపేటకు వచ్చి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కొన్ని పరీక్షలకు ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి ముందుగా పేరు నమోదు చేసుకుంటే 4, 5 గంటల తర్వాత పరీక్షలు చేసేవారు. ఆ ఫలితాలకు కూడా మరునాడు వెళ్లాల్సి వచ్చేది. దీని కోసం రెండురోజుల పాటు పట్టణంలో తిరగాల్సి వస్తుండేది. కానీ డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుతో వారి పరిధిలోని పీహెచ్సీ సెంటర్లో రక్తనమూనాలను ఇస్తే 12 గంటల్లో వారి ఫలితాలు నేరుగా సెల్‌ఫోన్‌కు వస్తున్నాయి.
33 సెంటర్ల నుంచి శాంపిళ్ల సేకరణ
సిద్దిపేట జిల్లా మొత్తంగా 33 సెంటర్ల నుంచి జిల్లాకేంద్రంలోని డయాగ్న స్టిక్ సెంటర్‌కు శాంపిల్స్ తీసుకువస్తున్నారు. సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్ ఆసుపత్రులు, సిద్దిపేట వెల్నెస్ సెంటర్లతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్న 27 పీఎ్‌సఈ సెంటర్ల నుం చి ప్రత్యేక వాహనాల ద్వారా ప్రతీరోజు రక్తనమూనాలను తీసుకువస్తున్నారు. రోజు సాయంత్రం 4 గంటల వరకు సెంటర్ చేరుకుంటాయి. సెంటర్లోని వైద్యులు వాటిని 5 గంటల పాటుఎగ్జిమిషన్ చేసి ఉదయం 10 గంటల (ఓపీ సమయం) వరకు పీఎ్‌సఈ సెంటర్లకు, సెల్ఫోన్లకు ఫలితాల పంపిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ నెలాఖరులో సిద్దిపేటకు వచ్చిన పరికరాలను రెండు రోజుల పాటు డ్రై రన్ నిర్వహించారు. ఈ డ్రైరన్‌లో 17,200 పరీక్షలు చేశారు. అనంతరం ఈనెల 2న మంత్రి హరీశ్‌రావు పరికరాలను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ సెంటర్లో 33,551 పరీక్షలు చేశారు. పరీక్షలకు దాదాపు రూ.కోటి వరకు ఖర్చయినట్లు డీఎంహెచ్‌వో కాశీనాథ్ తెలిపారు.
ప్రైవేట్ సెంటర్లకు వెళ్లొద్దు
హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
సిద్దిపేటలో రూ.కోట్లు ఖర్చు చేసి పేదల కోసం డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేశాం. ప్రైవేట్ సెంటర్‌కు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ప్రజలు ఈ హబ్‌ను వినియోగించుకొవాలి. ఇది నిరంతరం మీ సేవలోనే ఉంటుంది. అంతేకాకుండా ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి.
నిరంతరం శ్రమిస్తున్నారు
- కాశీనాథ్, డీఎంహెచ్‌వో సిద్దిపేట
డయాగ్నస్టిక్ సెంటర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ పరంగా సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ మావైద్యులు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డయాగ్నస్టిక్ సెంటర్‌ను వినియోగించుకోవాలి.
