త్వరలోనే ఎంసీహెచ్‌ ప్రారంభిస్తాం

ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST

జిల్లా కేంద్రంలో మాతాశిశు సంరక్షణ కోసం త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తేనున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.

త్వరలోనే ఎంసీహెచ్‌ ప్రారంభిస్తాం
ప్రహరీ పనులకు భూమి పూజచేస్తున్న ఎమ్మెల్యే పద్మారెడ్డి

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 

మెదక్‌ మున్సిపాలిటీ/మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 25 : జిల్లా కేంద్రంలో మాతాశిశు సంరక్షణ కోసం త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తేనున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం పట్టణ శివారులో ఎంసీహెచ్‌ మెటర్నిటీ అండ్‌ చైల్డ్‌ ఆస్పత్రి ప్రాణంలో రూ.2 కోట్లతో నిర్మించే రహదారి, ప్రహరీ పనులకు ఆమె భూమి పూజ చేసి మాట్లాడారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలందించే దిశగా ఆస్పత్రిని సిద్ధం చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, శివదయాల్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రమాదాలు, క్రైం రేటు తగ్గించడానికి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మెదక్‌లోని రాందాస్‌ చౌరస్తా నుంచి బోధన్‌ చౌరస్తా వరకు రూ.15 లక్షలతో ఏర్పాటుచేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ బట్టి జగపతి, డీఎస్పీ సైదులు, సీఐ వెంకట్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST