భూ తగాదాలో మా ప్రమేయం లేదు

ABN , First Publish Date - 2021-10-20T04:22:38+05:30 IST

మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామానికి చెందిన కొత్త హరీశ్‌ అనే వ్యక్తి తనను కొంత మంది రాజకీయ నాయకులు కిడ్నాప్‌ చేశారనే అరోపణలను కౌడిపల్లి సర్పంచ్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తోసిపుచ్చారు.

భూ తగాదాలో మా ప్రమేయం లేదు

సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి 

కౌడిపల్లి, అక్టోబరు 19: మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామానికి చెందిన కొత్త హరీశ్‌ అనే వ్యక్తి తనను కొంత మంది రాజకీయ నాయకులు కిడ్నాప్‌ చేశారనే అరోపణలను కౌడిపల్లి సర్పంచ్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తోసిపుచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరి భూములను బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని పేద, బలహీన వర్గాల అభ్యున్యతి కోసం పాటుపడతానని పేర్కొన్నారు. స్వర్గస్థులైన తన తండ్రి చిలుముల ఆశిరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఉపసర్పంచ్‌ శ్రీనివా్‌సగౌడ్‌కు సైతం భూతగదాలో ఎటువంటి ప్రమేయం లేదని, అనవరంగా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమ ఉనికిని దెబ్బ తిసేందుకే హరీశ్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-20T04:22:38+05:30 IST