పండగొస్తే చాలు నీటి సరఫరా బంద్‌

ABN , First Publish Date - 2021-11-06T04:40:42+05:30 IST

పండగొస్తే చాలు అల్లాదుర్గం పట్టణ వాసులకు నీటి సరఫరా నిలచిపోతుంది. యాదృచ్ఛికమో లేక ఇతర కారణాలో తెలియదు కానీ కొన్నేళ్లుగా ఇదే తంతు సాగుతుండడంతో అధికారుల తీరు పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పండగొస్తే చాలు నీటి సరఫరా బంద్‌

అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అల్లాదుర్గం పట్టణ వాసులు

అల్లాదుర్గం. నవంబరు 5 : పండగొస్తే చాలు అల్లాదుర్గం పట్టణ వాసులకు నీటి సరఫరా నిలచిపోతుంది. యాదృచ్ఛికమో లేక ఇతర కారణాలో తెలియదు కానీ  కొన్నేళ్లుగా ఇదే తంతు సాగుతుండడంతో అధికారుల తీరు పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా స్థానికులు గుక్కెడు నీటి కోసం పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొన్నది. మిషన్‌ భగీరథ పథకం ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు నిలిచిపోవడం, గ్రామీణ రక్షిత మంచి నీటి పథకం ద్వారా సరఫరా చేసే బోరు సైతం చెడిపోవడంతో నీటి సరఫరా నిలచిపోయింది. కాగా కొన్నేళ్లుగా ఏ పండగ వచ్చిన నీటి సరఫరా నిలచిపోవడంపై ఆగ్రహంగా ఉన్న స్థానికులు తాజాగా దీపావళి పండగ రోజూ కూడ నీటి సరఫరా నిలపివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పండగ సందర్భంగా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 ఝాన్సీలింగాపూర్‌లో ఈఈ పరిశీలన

రామాయంపేట, నవంబరు 5: రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్‌లో తాగునీటి సరఫరాను మిషన్‌భగీరథ ఈఈ కమలాకర్‌ పర్యవేక్షించారు. శుక్రవారం సాయంత్రం ఆయనతో పాటు డిప్యుటీ ఈఈ శ్రీనివాస్‌, ఏఈ కిరణ్‌ గ్రామంలోని పలు వార్డుల్లో నీటిసరఫరాను పరిశీలించారు. ప్రతినిత్యం నీరు వస్తుందా? సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయా అని కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్పంచ్‌ పంబాల జ్యోతి, వార్డుసభ్యులు ఉన్నారు. 

Updated Date - 2021-11-06T04:40:42+05:30 IST