సమష్టి కృషితో గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-12-29T05:28:48+05:30 IST

అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో ముందుకెళ్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.

సమష్టి కృషితో గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే

మెదక్‌, డిసెంబరు 28 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో ముందుకెళ్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్‌లోని క్యాంపు కార్యాలయంలో మండలంలోని వివిధశాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పల్లెప్రగతి కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పనులకు సంబంధించిన రికార్డులను వెంటనే చేసి బిల్లులు అందేలా చూడాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ఆదేశించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఉపాధిహామీ పీడీ సర్పంచులను కోరారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యారెడ్డి, పీఆర్‌ఎస్సీ కనకరత్నం, డీఆర్డీఏ శ్రీనివాస్‌, డీపీవో తరుణ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కమలాకర్‌, డీఏవో పరశురాంనాయక్‌, ఆర్‌ఆండ్‌బీ వెంకటేశం, పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఈఈ పాండు రంగారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ విజయభాస్కర్‌రెడ్డి, ఎలక్ర్టిసిటీ డీఈ కృష్ణారావు, సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-29T05:28:48+05:30 IST