ఘనంగా వేంకటేశ్వరస్వామి రఽథం ఊరేగింపు

ABN , First Publish Date - 2021-01-12T05:50:03+05:30 IST

: సంగారెడ్డి శివారులోని శ్రీవైకుంఠపురంలో వెలసిన మహాలక్ష్మీ గోదాసమేత విరాట్‌ వేంకటేశ్వరస్వామి రథయాత్ర సోమవారం సాయంత్రం కన్నులపండువగా సాగింది.

ఘనంగా వేంకటేశ్వరస్వామి రఽథం ఊరేగింపు
శ్రీవారి రఽథయాత్రలో పాల్గొన్న దేవనాఽఽథజీయర్‌స్వామి

హాజరైన దేవనాథజీయర్‌స్వామి

సంగారెడ్డి అర్బన్‌, జనవరి 11 : సంగారెడ్డి శివారులోని శ్రీవైకుంఠపురంలో వెలసిన మహాలక్ష్మీ గోదాసమేత విరాట్‌ వేంకటేశ్వరస్వామి రథయాత్ర సోమవారం సాయంత్రం కన్నులపండువగా సాగింది. పట్టణంలోని బాలాజీ మంజీరా గార్డెన్స్‌ నుంచి ప్రారంభమైన రథయాత్ర ఐబీ, కొత్తబస్టాండ్‌, పాత బస్టాండ్‌ మీదుగా శ్రీవైకుంఠపుర దేవస్థానికి చేరుకుంది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకందాడై వరదాచార్యులు పర్యవేక్షణలో శ్రీవారి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. అహోబిల దేవనాఽఽథజీయర్‌స్వామి హారతి ఇచ్చి రధయాత్రను ప్రారంభించగా డీఎస్పీ బాలాజీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రలో దారిపొడవునా రంగురంగుల ముగ్గులు, మహిళల కోలాటాలు, భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా రథోత్సవానికి భక్తులు నీరాజనం పలికారు.

Updated Date - 2021-01-12T05:50:03+05:30 IST