పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలి
ABN , First Publish Date - 2021-11-30T04:51:59+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తొలగించాలంటూ బీజేపీ ఆందోళన చేపట్టింది.
రామాయంపేట, నవంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తొలగించాలంటూ బీజేపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం రామాయంపేటలో నిరసన గళం విప్పారు. స్థానిక మెదక్ చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం అక్కడి నుంచి సిద్దిపేట వరకు భారీ ర్యాలీగా కదిలి రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్రం చమురు ధరలు తగ్గించినా.. సీఎం కేసీఆర్ వ్యాట్ ఎత్తేయకపోవడంతో ధరలు తగ్గడం లేదని బీజేపీ నేతలు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం దిగిరాక పోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు శివరాం, శంఖర్‌గౌడ్, కౌన్సిలర్ సుందర్‌సింగ్ హెచ్చరించారు.
ఎడ్లబండ్లతో నిరసన
పాపన్నపేట: డీజిల్, పెట్రోల్ ధరలపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ మండలాధ్యక్షుడు బికొండ రాములు డిమాండ్ చేశారు. సోమవారం పాపన్నపేటలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించి, అనంతరం తహసీల్దార్ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసనలో నాయకులు సంతోష్, నరేష్, విఠల్, దుర్గయ్య, తదితరులు ఉన్నారు.
చిల్‌పచెడ్: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ మండలాధ్యక్షుడు దశరథ ఆధ్వర్యంలో వినూత్నంగా ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ సహదేవ్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసనలో జిల్లా ఎస్టీమోర్చా ఉపాధ్యఽక్షుడు కిషన్‌నాయక్, మండల ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, యువమోర్చా అధ్యక్షుడు సతీష్, కార్యదర్శి హరీశ్, సీనియర్ నాయకులు మొగులయ్య, బాల్‌రాజ్, అశోక్ తదితరులు ఉన్నారు.
తూప్రాన్: పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విఽధిస్తున్న వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. తూప్రాన్‌లో బీజేపీ నాయకులు ఎడ్లబండితో ఊరేగింపుగా వచ్చి పెట్రోల్‌బంక్ వద్ద ఆందోళన చేట్టారు. ‘‘వ్యాట్‌ను తగ్గించాలని, వద్దురా నాయన కేసీఆర్ పాలన, కేసీఆర్ డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, నర్సోజీ, విఠల్, నర్సింహారెడ్డి, జానకీరాంగౌడ్, సంతోష్, రమే్‌షగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారులకు పెట్రోల్ పోసి నిరసన
నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం నర్సాపూర్‌లో పెట్రోల్ బంక్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనలో భాగంగా వినియోగదారులకు కొద్దిసేపు రూ. ఐదు తగ్గించి పెట్రోల్ పోయించి ఆ డబ్బులు వారు యజమానికి చెల్లించారు. జిల్లా నాయకులు వాల్దా్‌సమల్లేశ్‌గౌడ్, పి.రమే్‌షగౌడ్, శంకర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజిగౌడ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు.
తహసీల్‌లో వినతిపత్రం అందజేత
నారాయణరావుపేట/రాయపోల్, నవంబరు 29 : రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జిల్లెల్ల రమే్‌షగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణరావుపేటలో బీజేపీ మండలాధ్యక్షుడు మోత్కు బుగ్గ రాజేశం ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని రాష్ట్రశాఖ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తగ్గించకపోవడం దారుణమన్నారు. వ్యాట్ తగ్గించే వరకు దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో బీజేపీ నాయకులు బోయిని రాంచంద్రం, సంజీవరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, దిలీప్, రాజనర్సు, రాకేష్, నరేష్ పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దౌల్తాబాద్‌లో బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. నిరసనలో పార్టీ మండలాధ్యక్షుడు కిషన్, జిల్లా అధికార ప్రతినిధి మంగళి యాదగిరి, నాయకులు స్వామి, నర్సింహులు, రవీందర్ పాల్గొన్నారు.