వామ్మో.. బెడ్‌రూంలో 14 పాము పిల్లలు

ABN , First Publish Date - 2021-03-14T06:28:36+05:30 IST

సాధారణంగా ఇంట్లో పాము కనిపిస్తేనే ఒల్లు జల్లుమంటుంది. అలాంటిది.. ఏకంగా 14 పాము పిల్లలు కనిపిస్తే ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు.

వామ్మో.. బెడ్‌రూంలో 14 పాము పిల్లలు
ఇంట్లో ఉన్న పాము పిల్లలను చంపిన దృశ్యం

మెదక్‌ అర్బన్‌, మార్చి13: సాధారణంగా ఇంట్లో పాము కనిపిస్తేనే ఒల్లు జల్లుమంటుంది. అలాంటిది.. ఏకంగా 14 పాము పిల్లలు కనిపిస్తే ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు. అలాంటి ఘటనే శనివారం ఉదయం మెదక్‌ జిల్లా కేంద్రంలోని 20 వార్డులో ప్రేమ్‌సురేందర్‌ అనే వ్యక్తి ఇంట్లో జరిగింది. రెండుమూడు కాదు ఏకంగా 14 పాము పిల్లలు ఆ ఇంటి బెడ్‌ రూమ్‌లో చిన్నపిల్లలు ఆడుకునే గాలితో నింపిన బొమ్మ కింది నుంచి బయటకు వస్తున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. తర్వాత వాటన్నింటినీ చంపేశారు. ఆ పాములు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని, పక్కన మురుగుకాల్వ ఆవాసంగా మారిన విషయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌, స్ధానిక కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-14T06:28:36+05:30 IST