మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శప్రాయుడు

ABN , First Publish Date - 2021-10-21T04:54:18+05:30 IST

మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శప్రాయుడని శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ బోయవాడైన వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించిన గొప్ప వ్యక్తిగా ప్రపంచానికి తెలుసన్నారు.

మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శప్రాయుడు
మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి

ఆయన జీవితం మార్పునకు నిదర్శనం 

శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి


సంగారెడ్డి రూరల్‌, అక్టోబరు 20 : మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శప్రాయుడని శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ బోయవాడైన వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించిన గొప్ప వ్యక్తిగా ప్రపంచానికి తెలుసన్నారు. మహర్షి వాల్మీకిని అందరూ స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని ఆకాంక్షించారు. వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశం మాట్లాడుతూ జిల్లాలో వాల్మీకి భవనం నిర్మించాలని, వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని భూపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజార్షిషా, వీరారెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, బీసీ సంక్షేమాభివృద్ధి అధికారి కేశురాం, వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు పండరి, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ, వివిధ సంఘాల నాయకులు ప్రశాంత్‌, హరిహరకిషన్‌, గోలియదవ్‌, విజయ్‌ప్రకాష్‌, ఆకాశమేణి, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T04:54:18+05:30 IST